Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓటీఎస్‌ పథకంపై సీపీఎం నేత బి.వి.రాఘవులు ఆగ్రహం

విశాఖ: ఓటీఎస్‌ పథకంపై సీపీఎం నేత బి.వి.రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దివాళా తీసిన ప్రభుత్వానికి డబ్బులు సమకూర్చుకోవడానికే ఓటీఎస్‌ అన్నారు. నిజంగా పేదవాళ్లకు ఇళ్లపై హక్కు కల్పించాలని అనుకుంటే ఓటీఎస్ విధానం లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. ఓటీఎస్ పేరుతో పేదలపై భారం వేయడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. ఓటీఎస్ అనేది పేదలకు వ్యతిరేకమైన చర్య అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఓటీఎస్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 

Advertisement
Advertisement