Abn logo
Jan 17 2021 @ 15:38PM

మనం ఫేక్ డెమొక్రసీలో ఉన్నట్లే: అర్నాబ్ వాట్సాప్ లీక్‌పై తెలుగు దర్శకుడు

హైదరాబాద్: రిపబ్లిక్ టీవీ చానల్ సీఈవో అర్నాబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్‌పై తెలుగు సినీ దర్శకుడు బీవీఎస్ రవి ఆందోళన వ్యక్తం చేశారు. బయటికి లీకైన 500 పేజీల అర్నాబ్ వాట్సాప్ చాట్ నిజమే అయితే మనం నకిలీ ప్రజాస్వామ్యంలో ఉన్నట్లేనని ఆయన అన్నారు. తాను ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన వారి వ్యతిరేకులతోనో ఇతరులతోనో అనుకూలమైన దృక్పథం ఉన్నట్లు కాదని బీవీఎస్ రవి అన్నారు.


తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అర్నాబ్ వాట్సాప్ లీక్‌పై బీవీఎస్ రవి స్పందిస్తూ ‘‘అర్నాబ్ వాట్సాప్ చాట్ నిజమే అయితే, మనం నకిలీ ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నట్లే. రాజకీయపరంగా నాకు ఏ ఇతర న్యూస్ చానళ్లతో అనుబంధం అవసరం లేదు’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు అర్నాబ్ గోస్వామి ఎక్స్‌పోస్‌డ్’, ‘అర్నాబ్ గేట్’ అనే రెండు హ్యాష్‌ట్యాగుల్ని జత చేశారు.


దేశవ్యాస్తంగా సంచలనం సృష్టించిన టీఆర్‌పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తుండగానే... రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన సంభాషణలు లీక్ అయ్యాయి. దాదాపు 500 పేజీలకు పైగా ఉన్న ఈ చాట్ మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంట్లో రక్షణ రహస్యాలు సహా అనేక మంది గురించి ఇద్దరి మధ్య కీలక సంభాషణ జరిగింది. ఈ సంభాషణపై దేశ వ్యాప్తంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement