డిసెంబరు ‘21 నాటికి... 53 మిలియన్ల మంది నిరుద్యోగులు...

ABN , First Publish Date - 2022-01-22T01:14:14+05:30 IST

భారత్‌లో మొన్న డిసెంబరు నాటికి 53 మిలియన్ల మంది నిరుద్యోగులు ఉన్నట్లుగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వెల్లడించింది.

డిసెంబరు ‘21 నాటికి... 53 మిలియన్ల మంది నిరుద్యోగులు...

న్యూఢిల్లీ : భారత్‌లో మొన్న డిసెంబరు నాటికి 53 మిలియన్ల మంది నిరుద్యోగులు ఉన్నట్లుగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వెల్లడించింది. ఈ నివేదిక... ఈ నిరుద్యోగుల్లో మహిళల వాటా ఎక్కువగా ఉందని, ఈ నిరుద్యోగుల్లో 35 మిలియన్ల మంది ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని తెలిపింది. ఇక... 17 మిలియన్ల మందికి ఎలాంటి అవకాశాలూ లేవు. ఇందులో 9 మిలియన్ల మంది మహిళలున్నారు. దేశంలో... కిందటి నెలలో నిరుద్యోగిత రేటు 7.9 శాతం, ఉద్యోగం లేనివారు 35 మిలియన్ల మంది ఉన్నారు. ప్రపంచ ఉపాధి రేటు ప్రమాణాలను భారత్ అందుకోవాలంటే అదనంగా 18.75 కోట్ల మందికి ఉద్యోగాలను కల్పించాల్సి ఉందని సీఎంఐఈ పేర్కొంది. ఇక... అంతర్జాతీయంగా... నిరుద్యోగుల సంఖ్య 20.7 కోట్లుగా ఉంటుందని ఐఎల్‌వో తాజా నివేదిక తెలిపింది.


దేశంలో 3.5 కోట్ల మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, వారు ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని సీఎంఐఈ వెల్లడించింది. నిరుద్యోగ రేటులో 7.9 శాతంగా ఉన్న వీరికి తక్షణమే ఉపాధి కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. ఇందులో 23 శాతం మంది, లేదా... 8 మిలియన్ల మంది మహిళలున్నారు. అవకాశం రాని నిరుద్యోగులు 1.7 కోట్లు ఉండగా, ఇందులో మహిళల వాటా 53 శాతం, లేదా... 90 లక్షలుగా ఉంది. వీరి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే పని కోసం అంత ఉత్సాహంగా చూడటం లేదని తెలిపింది.


ఎందుకు ?

పని చేయడానికి ఆసక్తిగా ఉన్న మహిళలు ఎందుకు దరఖాస్తు చేయడం లేదన్న అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. ఉద్యోగాల లభ్యత లేకపోవడమా ? లేక... శ్రామికశక్తిలో చేరడానికి సామాజిక మద్దతు లేకపోవడమా ? అన్న కోణాల్లో  పరిశోధించాల్సిన అవసరముందని పేర్కొంది.


Updated Date - 2022-01-22T01:14:14+05:30 IST