Abn logo
Sep 18 2021 @ 00:50AM

బైజూస్‌ చేతికి ‘టింకర్‌’

ఎడ్యుటెక్‌ వేదిక ‘బైజూస్‌’, కోడింగ్‌ సంస్థ ‘టింకర్‌’ను విలీనం చేసుకుంది. కొనుగోలు రేటు వెల్లడి కాలేదు. అమెరికాలో తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు వీలుగా ‘టింకర్‌’ను విలీనం చేసుకున్నట్టు ఆ సంస్థ తెలిపింది. దీంతో బైజూస్‌కు మరో లాభం కూడా ఉంది. టింకర్‌ ఆధీనంలో ఉన్న అరవై కోట్ల మంది విద్యార్థులు 150 దేశాల్లోని లక్షకు పైగా స్కూళ్ళు కూడా బైజూస్‌ పరిధిలోకి వస్తాయి. ఈ రెండు సంస్థల ఉమ్మడి కల, లక్షల మంది విద్యార్థులకు కోడింగ్‌ అందుబాటులోకి వస్తుంది. విలీనమైనప్పటికీ ‘టింకర్‌’ కోఫౌండర్లు ప్రస్తుతం తాము ఉన్న స్థానాల్లోనే కొనసాగుతారు.