Advertisement
Advertisement
Abn logo
Advertisement

గూగుల్‌తో బైజూస్‌ జట్టు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌తో జట్టు కట్టినట్లు ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ యాప్‌ బైజూస్‌ ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా గూగుల్‌ వర్క్‌స్పేస్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ను తమ విద్యార్థి ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానిస్తున్నట్లు తెలిపింది. తద్వారా భారత పాఠశాలలకు ఉచితంగా లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ను అందించనున్నట్లు బుధవారం నాటి ప్రకటనలో బైజూస్‌ పేర్కొంది. ఈ కార్యక్రమం కోసం రిజిస్టర్‌ చేసుకున్న పాఠశాలల అధ్యాపకులు బైజూ్‌సకు చెందిన గణిత, సామాన్య శాస్త్ర భోధన పరిష్కారాల ద్వారా తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చేందుకు వీలుంటుంది. 

Advertisement
Advertisement