విద్యావేత్తలకు సినారె స్మారక పురస్కారాలు

ABN , First Publish Date - 2021-07-30T05:48:21+05:30 IST

తెలుగు భాషాభివృద్ధికి జీవితకాలం కృషి చేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి 90వ జయంతి పురస్కరించుకుని తెలుగు కళావాహిని, ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమి, అక్కినేని ఫౌండేషన్‌ సంస్థలు విద్యావేత్తలకు సినారే స్మారక పురస్కారాలు ప్రదానం చేశారు.

విద్యావేత్తలకు సినారె స్మారక పురస్కారాలు

విద్యావేత్తలకు సినారె స్మారక పురస్కారాలు

గాంధీనగర్‌, జూలై 29 : తెలుగు భాషాభివృద్ధికి జీవితకాలం కృషి చేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి 90వ జయంతి పురస్కరించుకుని తెలుగు కళావాహిని, ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమి, అక్కినేని ఫౌండేషన్‌ సంస్థలు విద్యావేత్తలకు సినారే స్మారక పురస్కారాలు ప్రదానం చేశారు. గాంధీనగర్‌లోని తెలుగు కళావాహిని కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ నేలటూరి అనితా మార్గరెట్‌, డాక్టర్‌ కమ్ముల శేషుకుమార్‌, ఎం.అంజయ్యలకు వక్తలు పురస్కార గ్రహీతలకు దుశ్శాలువ, జ్ఞాపికలను అందజేశారు. చింతకాయల చిట్టిబాబు, డేవిడ్‌ రాజు, కారుమంచి రాజు, మాంతి వెంకటరమణ, చింతా వెంకటేశ్వర్లు, శ్యామ్‌ ప్రసాద్‌, సయ్యద్‌ అలీ, రామతీర్థ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T05:48:21+05:30 IST