చిన్న పరిశ్రమలను స్టాక్ మార్కెట్లో పెడతాం: గడ్కరి

ABN , First Publish Date - 2020-06-02T00:28:12+05:30 IST

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) పునరుత్తేజం కల్పించే రెండు ప్యాకేజీలకు సంబంధించిన విధివిధానాలు..

చిన్న పరిశ్రమలను స్టాక్ మార్కెట్లో పెడతాం: గడ్కరి

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) పునరుత్తేజం కల్పించే రెండు ప్యాకేజీలకు సంబంధించిన విధివిధానాలు, రోడ్ మ్యాప్‌కు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. ఎస్ఎస్ఎంఈ రంగానికి 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ఇస్తున్నామని చెప్పారు.


ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతను సోమవారంనాడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశానంతరం జరిగిన మీడియా సమావేశంలో గడ్కరి ఆ వివరాలను వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎంఎస్ఎంఈలకు కొత్త అర్ధాన్ని ఇచ్చామని, ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు మార్కెట్లో లిస్టింగ్ చేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. వాటిలో కొన్ని షేర్లను ప్రభుత్వ కొని వారికి మద్దతు ఇస్తుందని చెప్పారు. ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు రూ.50 వేల కోట్లు ఈక్విటీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 29 శాతం సూక్ష్మ, చిన్న పరిశ్రమలదేనని, ఇవి 11 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు.

Updated Date - 2020-06-02T00:28:12+05:30 IST