ఖరీఫ్ పంటకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

ABN , First Publish Date - 2020-06-01T23:50:59+05:30 IST

ఖరీప్ పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను..

ఖరీఫ్ పంటకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ: ఖరీప్ పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియా ముందు వెల్లడించారు. 14 ఖరీప్ పంటలకు ఎంఎస్‌పీని 50 శాతం నుంచి 83 శాతానికి పెంచుతున్నట్టు చెప్పారు. ఇందువల్ల రైతులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని చెప్పారు.


2020-21 సంవత్సరానికి వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర  రూ.1,868, జొన్న రూ.2,620, సజ్జలు రూ.2,150గా ఉంటుందన్నారు. రాగి, పెసలు, వేరుసెనగ, సోయాబీన్, పత్తికి 50 శాతం ఎంఎస్‌పీ పెంచుతున్నామని అన్నారు. వ్యవసాయ, అనుబంధ కార్యక్రమాలకు కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న స్వల్పకాలిక రుణాల చెల్లింపు గడువును ఆగస్టు వరకూ పొడిగించే వెసులుబాటు కల్పించినట్టు తోమర్ తెలిపారు.

Updated Date - 2020-06-01T23:50:59+05:30 IST