సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్‌

ABN , First Publish Date - 2020-03-26T20:28:58+05:30 IST

కరోనా వైరస్‌ మహమ్మారిని నివారించడానికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిర్వహించిన నేపధ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ తీరుపై కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌గౌబ

సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ మహమ్మారిని నివారించడానికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిర్వహించిన నేపధ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ తీరుపై కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌గౌబ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో వీడియోకాన్ఫరెన్‌ నిర్వహించారు. తెలలంగాణలో లాక్‌డౌన్‌ వల్ల నిత్యావసరాల పంపిణీ, రవాణా తదితర అంశాలపై రాజీవ్‌గౌబ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పకడ్బందీగా లాక్‌డౌన్‌ జరుగుతోందని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వివరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిత్యావసరాలు, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. నిత్యావసర సరుకుల రవాణాకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-26T20:28:58+05:30 IST