పోడు భూముల పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

ABN , First Publish Date - 2021-10-02T23:48:52+05:30 IST

తెలంగాణలో పోడు భూముల విషయంలో కొనసాగుతున్న ఆందోళన, ప్రభుత్వ చర్యలపై చర్చించడానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశమైంది.

పోడు భూముల పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణలో పోడు భూముల విషయంలో కొనసాగుతున్న ఆందోళన, ప్రభుత్వ చర్యలపై చర్చించడానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశమైంది. బిఆర్‌కె భవన్‌లో కమిటీ అధ్యక్షురాలు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాధోడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు, అటవీ, పర్యావరణ శాఖమంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోడు భూముల విషయంలో గత కొంత కాలంగా కొనసాగుతున్న ఆందోళన, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో చర్చించారు. 


పోడుభూముల్లో గిరిజనులు వ్యవసాయం చేసుకుంటున్న నేపధ్యంలో పలు మార్లు అటవీ శాఖ అధికారులు వారిని అక్కడి తొలగిస్తూ వస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి సాయం చేస్తేబాగుంటుందన్న విషయాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, అటవీశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ, గిరిజన శాఖ కమిషనర్‌ షర్ఫరాజ్‌ అహ్మద్‌, అటవీ పరిరక్షణ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆర్‌. శోభ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-02T23:48:52+05:30 IST