‘ఒమిక్రాన్’ నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-11-29T22:37:09+05:30 IST

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్’ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

‘ఒమిక్రాన్’ నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

హైదరాబాద్: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్’ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించింది. ప్రత్యేకించి రాష్ట్రంలో కోవిడ్ టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ నియమించింది.ఈ సబ్ కమిటీకి వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు చైర్మన్ ఉంటారు.  అర్బన్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి కేటిఆర్, పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లు సభ్యులుగా వుంటారు.

Updated Date - 2021-11-29T22:37:09+05:30 IST