Abn logo
Apr 9 2021 @ 14:11PM

వీగన్లకు కాల్షియం ఎలా?

ఆంధ్రజ్యోతి(09-04-2021)

ప్రశ్న: వీగన్‌ ఆహారం తీసుకునేవారు ఎముకల  ఆరోగ్యానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?


-మృణాళిని, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: వీగన్‌ ఫుడ్‌ అంటే పూర్తి శాకాహారం. జంతు సంబంధిత ఎలాంటి ఆహారాన్నీ వీగన్‌లు తినరు. అందువల్లే పాలు, పెరుగు, పాల పదార్థాలు, తేనె, గుడ్లు, మాంసాహారం వీళ్ల ఆహారంలో ఉండవు. ఆవుపాలు, గేదెపాలు, ఆ పాల నుండి తయారుచేసే పనీర్‌, పెరుగు, చీజ్‌ తదితరాలను పూర్తిగా మానెయ్యడం వల్ల వాటిలోని ప్రొటీన్లు, కొన్ని రకాల ఆవశ్యక అమైనో ఆసిడ్లు, కాల్షియం, కొన్ని విటమిన్లు తగిన మోతాదుల్లో అందవు. అందుకే వీగన్‌ డైట్‌ను అనుసరించే వాళ్లు పాలు, తదితరాలు అందించే పోషకాలను ఇతర పదార్థాల నుండి పొందేందుకు ప్రయత్నించాలి. కాల్షియం కోసం క్యాబేజీ, బ్రోకలి, బెండకాయ, వివిధ రకాల ఆకుకూరలు, ఫోర్టిఫై చేసిన సోయా పాలు, సోయా పనీర్‌, బాదం, ఆక్రోట్‌ గింజలు, అన్ని రకాల పప్పులు, రాజ్మా, నల్ల శనగలు, అలసందలు తదితరాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే వీటిలోని కాల్షియాన్ని శరీరం శోషించుకునేందుకు విటమిన్‌ - డి అవసరం. దీని కోసం రోజూ కనీసం 30 నిమిషాలపాటు ఎండలో గడపాలి. ఒకవేళ ఆహారం ద్వారా పూర్తిగా కాల్షియాన్ని పొందలేకపోతే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్‌ను వాడవచ్చు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

([email protected]కు పంపవచ్చు)

Advertisement
Advertisement
Advertisement