కార్వీ ‘ఖాతాల’ విలువ లెక్కకట్టండి

ABN , First Publish Date - 2021-03-26T05:43:41+05:30 IST

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాల విలువను మదింపు చేయాలని బొంబాయి హై కోర్టు ఆదేశించింది. ఇందుకు ఎస్‌బీఐ కేపిటల్‌ మార్కెట్స్‌, కేపీఎంజీలను నియమించింది.

కార్వీ ‘ఖాతాల’ విలువ లెక్కకట్టండి

ఎస్‌బీఐ కేపిటల్‌, కేపీఎంజీలకు హైకోర్టు ఆదేశం..

బదిలీ ప్రక్రియ ఆగదు.. కారు చౌకగా విక్రయించారన్న కార్వీ


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాల విలువను మదింపు చేయాలని బొంబాయి హై కోర్టు ఆదేశించింది. ఇందుకు ఎస్‌బీఐ కేపిటల్‌ మార్కెట్స్‌, కేపీఎంజీలను నియమించింది. కార్వీ ఖాతాదారుల షేర్లను తాకట్టు పెట్టి నిధులు సమీకరించిన కేసుకు సంబంధించి ఖాతాదారులకు నగదు చెల్లించడానికి నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ (ఎన్‌ఎ్‌సడీఎల్‌), సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ (సీడీఎ్‌సఎల్‌) ఈ ఖాతాలను వేర్వేరుగా విక్రయించాయి. కార్వీకి చెందిన 11 లక్షల డీమ్యాట్‌ ఖాతాలను ఐఐఎ్‌ఫఎల్‌ సెక్యూరిటీస్‌ సొం తం చేసుకుంది. కార్వీ ట్రేడింగ్‌ ఖాతాలను యాక్సిస్‌ సెక్యూరిటీ కొనుగోలు చేసింది. దీనిపై కార్వీ గ్రూప్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాల ద్వారా  కనీసం రూ.816 కోట్లు లభించగలవని.. అయితే.. డిపాజిటరీలు కారు చౌక గా రూ.140 కోట్లకే ఖాతాలను విక్రయించాయని న్యాయస్థానంలో కార్వీ తన వాదనను వినిపించింది. ఒక బ్రోకింగ్‌ కంపెనీ డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలను డిపాజిటరీలు విక్రయించడం దేశంలో ఇదే మొదటి సారి. స్టాక్‌ ఎక్స్ఛేంజీలు కార్వీ బ్రోకింగ్‌ సభ్యత్వాన్ని రద్దు చేశా యి. ఈ నేపథ్యంలో డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాల విలువపై వేర్వేరుగా మదింపు నివేదికలు సమర్పించాల్సిందిగా ఎస్‌బీఐ కేపిటల్‌, కేపీఎంజీలను న్యాయస్థానం డివిజనల్‌ బెంచ్‌ కోరింది. తదుపరి విచారణలోపు ఈ రెండు విలువ మదింపు నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. తదుపరి విచారణను న్యాయస్థానం మే 3కు వాయిదా వేసింది. కేసులో ఎన్‌ఎస్‌ఈ, బీఎ్‌సఈ, మెట్రోపాలిటిన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలను కూడా ప్రతివాదులుగా కార్వీ పేర్కొంది.


ఖాతాదారుల ప్రయోజనమే ముఖ్యం 

డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాల విక్రయం బిడ్డింగ్‌ ప్రక్రియ ఏకపక్షంగా,  విశ్వసనీయతను దెబ్బ తీసేదిగా ఉందని కార్వీ వాదించింది. అయితే.. బిడ్డింగ్‌ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరిగిందని.. కార్వీ కోరిన విధంగా ఖాతాల విలువను అంచనా వేయడం సాధ్యం కాదని ఎన్‌ఎ్‌సడీఎల్‌, సీడీఎ్‌సఎల్‌ తరఫు న్యాయవాదులు వాదించారు. కార్వీ స్థానంలో మరో ట్రేడింగ్‌ సభ్యుడ్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, మరో డిపాజిటరీ పార్టిసిపెంట్‌ను డిపాజిటరీలు  నామినేట్‌ చేయడానికి  చేపట్టిన  ప్రక్రియను  తప్పుపట్టలేమని కోర్టు స్పష్టం చేసింది. డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలను ఐఐఎ్‌ఫఎల్‌, యాక్సిస్‌ సెక్యూరిటీ్‌సకు బదిలీ చేసే ప్రక్రియను నిలిపివేయాలన్న కార్వీ వాదనను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. కార్వీ ఖాతాదారుల ప్రయోజనాల కోసమే డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలను విక్రయించడం జరిగిందని.. అన్నింటి కంటే ఖాతాదారుల ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-03-26T05:43:41+05:30 IST