కోల్ కతా హైకోర్టు శుక్రవారం నుంచి సోమవారం వరకు మూసివేత

ABN , First Publish Date - 2020-07-09T22:09:04+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది

కోల్ కతా హైకోర్టు శుక్రవారం నుంచి సోమవారం వరకు మూసివేత

కోల్ కతా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సిటీలోని కంటైన్ మెంట్ జోన్లలో కొత్తగా లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో కోల్ కతా హైకోర్టు శుక్రవారం నుంచి సోమవారం వరకు మూసివేయబడుతుందన్నారు. కోల్ కతా హైకోర్టు శుక్రవారం నుంచి సోమవారం వరకు మూసివేయబడుతుందని, కోర్టు భవనాలను శానిటైజేషన్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ కారణంగా కోల్ కతా హైకోర్టు న్యాయ, పరిపాలనా పనులను ప్రధాన న్యాయమూర్తి జూలై 10 నుంచి 13 వరకు నిలిపివేసినట్లు రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు. హైకోర్టులోని మూడు భవనాలలో పూర్తిస్థాయి శానిటైజేషన్ ప్రక్రియను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.


Updated Date - 2020-07-09T22:09:04+05:30 IST