పంచ స్వర్ణాల కాలెబ్‌

ABN , First Publish Date - 2021-08-02T10:05:55+05:30 IST

పురుషుల స్విమ్మింగ్‌ అనగానే..మైకేల్‌ ఫెల్ప్స్‌, మార్క్‌ స్పిట్జ్‌, మ్యాట్‌ బియాండి ఠక్కున గుర్తుకొస్తారు. కారణం..వారంతా ఒకే ఒలింపిక్స్‌లో...

పంచ స్వర్ణాల కాలెబ్‌

పురుషుల స్విమ్మింగ్‌ అనగానే..మైకేల్‌ ఫెల్ప్స్‌, మార్క్‌ స్పిట్జ్‌, మ్యాట్‌ బియాండి ఠక్కున గుర్తుకొస్తారు. కారణం..వారంతా ఒకే ఒలింపిక్స్‌లో కనీసం ఐదు స్వర్ణాలు సొంతం చేసుకున్న దిగ్గజాలు. ఫెల్ప్స్‌ ఈ ఫీట్‌ను మూడు విశ్వక్రీడల్లో సాధించడం విశేషం. ప్రస్తుతం వారి జాబితాలో అమెరికాకు చెం దిన 24 ఏళ్ల కాలెబ్‌ డ్రస్సెల్‌ కూడా చేరా డు. స్విమ్మింగ్‌ పోటీల చివరి రోజు 50 మీ. ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌ను  21.07 సె. ఒలింపిక్‌ రికార్డుతో పూర్తి చేసిన స్వర్ణం దక్కించుకున్న కాలెబ్‌..4x100 మీ. మెడ్లే రిలేలోనూ బంగారు పతకం అందుకున్నాడు. ఈ ఈవెంట్‌లో అమెరికా ఏకంగా ప్రపంచ రికార్డు టైమింగ్‌ (3:26.78)తో అదర గొట్టింది. కాగా..రియోలో రెండు స్వర్ణాలతో కలిపి విశ్వక్రీడల్లో సెలెబ్‌ పతకాల సంఖ్య ఏడుకు చేరింది. 

Updated Date - 2021-08-02T10:05:55+05:30 IST