కొవిడ్ కేసుల్లో కాలిఫోర్నియా సరికొత్త రికార్డు!

ABN , First Publish Date - 2020-12-26T00:22:59+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 కరాళ నృత్యం చేస్తున్న చేస్తోన్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా.. కాలిఫోర్నియా సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలోనే అ

కొవిడ్ కేసుల్లో కాలిఫోర్నియా సరికొత్త రికార్డు!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 కరాళ నృత్యం చేస్తున్న చేస్తోన్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా.. కాలిఫోర్నియా సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. ఆ రాష్ట్రానికి చెందిన ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రోజు కాలిఫోర్నియాలో 39వేలకుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 351 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ బారినపడిన వారి సంఖ్య 20లక్షలు దాటింది. ఇందులో దాదాపు 24వేల మంది మహమ్మారికి బలయ్యారు. కాగా.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో దాదాపు 19వేల మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇందులో 4వేల మంది ఐసీయూలో ఉన్నారు. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య ఉధృతంగా ఉండటంతో కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో బాధితులతో ఐసీయూలు నిండిపోయాయి. 


Updated Date - 2020-12-26T00:22:59+05:30 IST