చలిపులి

ABN , First Publish Date - 2022-01-28T05:30:00+05:30 IST

చలిపులి

చలిపులి

  •  పెరిగిన  తీవ్రత 
  • 12.3 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

తాండూరు, జనవరి 28 : వికారాబాద్‌ జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ చలి తీవ్రత పెరగడంతో జనం వెన్నులో వణుకుపుడుతుంది. ఉదయం, సాయంత్రం జనం బయటికి రావాలంటే జంకుతున్నారు. పిల్లలు, వృద్ధులు చలికి తట్టుకోలేక పోతున్నారు. జిల్లా రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శుక్రవారం నవాబుపేటలో 12.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.  పూడూరులో 12.5 డిగ్రీలు యాలాల, మోమిన్‌పేట్‌లలో 12.6డిగ్రీలు, కోట్‌పల్లిలో 12.8, వికారాబాద్‌లో 13.8 డిగ్రీలు, బంట్వారంలో 13.9, పూడూరు, బొంరా్‌సపేట్‌లో 13.5, పరిగి 13.6, కుల్కచర్ల 14.3, బషీరాబాద్‌లో 13.8, పెద్దేముల్‌లో 14.6, కొడంగల్‌  13.4, దోమ 14.1, దౌల్తాబాద్‌ 13.8, ధారూర్‌ 13.4, తాండూరు 15.2, మర్పల్లి 12.7 డిగ్రీల  కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలితో వృద్ధులు, పిల్లలు వణికిపోతున్నారు.

Updated Date - 2022-01-28T05:30:00+05:30 IST