నేడు బాన్సువాడ బంద్‌కు పిలుపు

ABN , First Publish Date - 2021-07-30T04:34:32+05:30 IST

బాన్సువాడలో ఓ వర్గంపై జరిగిన దాడికి నిరసనగా శుక్రవారం బాన్సువాడ బంద్‌కు బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.

నేడు బాన్సువాడ బంద్‌కు పిలుపు
బాన్సువాడలో బంద్‌కు పిలుపునిస్తున్న బీజేపీ నాయకులు

బాన్సువాడ, జూలై 29: బాన్సువాడలో ఓ వర్గంపై జరిగిన దాడికి నిరసనగా శుక్రవారం బాన్సువాడ బంద్‌కు బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించారు. బంద్‌కు సహకరించాలని వ్యాపారులను కోరారు. కాగా బాన్సువాడలో భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. బంద్‌ ప్రభావం ఉండకుండా పోలీసులు బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-07-30T04:34:32+05:30 IST