శ్రీనివాస.. ట్రయల్స్‌కు రా!

ABN , First Publish Date - 2020-02-16T09:56:30+05:30 IST

కంబళ’ పోటీల్లో చిరుత వేగంతో పరిగెత్తిన శ్రీనివాస గౌడపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సా మాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కూడా

శ్రీనివాస.. ట్రయల్స్‌కు రా!

‘సాయ్‌’ నుంచి పిలుపు

బెంగళూరు: ‘కంబళ’ పోటీల్లో చిరుత వేగంతో పరిగెత్తిన శ్రీనివాస గౌడపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సా మాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కూడా అతడి ఘనతను కొనియాడుతున్నారు. దీంతో అతడికి కేంద్ర క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌) నుంచి కూడా పిలుపు అందింది. 28 ఏళ్ల శ్రీనివాస కోసం ఇప్పటికే రైలు టిక్కెట్లు బుక్‌ చేశామని, సోమవారం సాయ్‌ బెంగళూరు సెంటర్‌లో ట్రయల్స్‌ నిర్వహిస్తామని ‘సాయ్‌’ ట్వీట్‌ చేసింది. ఈ నెలారంభంలో జరిగిన కంబళ పోటీలో అతడు తన దున్నలతో 142.50 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్ల రికార్డు టైమింగ్‌తో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ వేగం 100మీ.లకు లెక్కేస్తే 9.55 సెకన్లుగా తేలింది. దీంతో ఇది ఉసేన్‌ బోల్ట్‌ ప్రపంచ రికార్డు (9.58 సె.)ను కూడా అధిగమించే వేగమని అంతా ఆశ్చర్యపోయారు.


క్రీడా మంత్రి స్పందన

శ్రీనివాసకు ఉత్తమ శిక్షణ అందిస్తే మరింత మెరుగ్గా రాణిస్తాడంటూ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర సూచించారు. ‘ఒక్కసారి అతడి శరీర దారుఢ్యాన్ని గమనించండి. అథ్లెటిక్స్‌లో అత్యున్నతంగా రాణించే సామర్థ్యం ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ 100మీ. రేసు లో అతడికి క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు శిక్షణ ఇప్పించినా లేక కంబళ ఈవెంట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చినా దేశానికి స్వర్ణం ఖాయం’ అని మంత్రిని ట్యాగ్‌ చేస్తూ ట్వీ ట్‌ చేశాడు. దీంతో మహీంద్ర ట్వీట్‌కు రిజిజు కూడా స్పందించారు. సాయ్‌ అ త్యున్నత కోచ్‌లతో శ్రీనివాస గౌడకు ట్రయల్స్‌ నిర్వహించేందుకు ఆహ్వానిస్తామన్నారు. ఆ వెంటనే సాయ్‌ స్పందించి గౌడకు ఆహ్వానం పలికింది.

Updated Date - 2020-02-16T09:56:30+05:30 IST