Abn logo
Sep 25 2021 @ 22:45PM

‘గెస్ట్‌’లకు పిలుపేదీ?

లోగో

- 17 నెలలుగా గెస్ట్‌ లెక్చరర్లు విధులకు దూరం
- కరోనాతో ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణకు ఇక్కట్లు
- ప్రభుత్వం ఆదుకోవాలని వినతి

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 25: కరోనాతో కళాశాలలు తెరువక పోవడంతో ఉపాధి కోల్పోయిన గెస్ట్‌ లెక్చరర్లు కుటుంబ పోషణకు ఇబ్బం దులు పడుతున్నారు. విద్యా వ్యవస్థను కరోనా అతలాకుతలం చేసింది. ఏడాదిన్నరగా విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కళాశాలల్లో పనిచేసే గెస్ట్‌ లెక్చరర్లు ఏడాదిన్నరగా ఉపాధిలేక భారంగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పోషణకు చాలామంది రోజువారి కూలీలుగా మారారు.


జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 జూనియర్‌ కళాశాలల్లో 32 మంది గెస్ట్‌ లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఏటా విద్యా సంవత్సరం తరగతులు ప్రారం భమైన నెల రోజుల్లో వీరిని ప్రభుత్వం రెన్యూవల్‌ చేసేది. కరోనా కార ణంగా 2020 మార్చి నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రస్తుతం కళాశాలలు ప్రారంభమైనప్పటికీ కాంట్రాక్ట్‌ సిబ్బంది నియామకంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆందోళన చెందుతు న్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాలను దృష్టిలో ఉంచు కొని ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గెస్ట్‌ లెక్చరర్లు కోరుతున్నారు.  

గెస్ట్‌ ఫ్యాకల్టీకి..
గెస్ట్‌ ఫ్యాకల్టీకి పీరియడ్‌కు రూ. 300 చొప్పున నెలకు రూ. 21,600 మించకుండా చెల్లించేవారు. వీరికి సెలవులు వర్తించవు. దసరా, సంక్రాం తి సమయంలో సెలవులు వస్తే వారికి ఆ నెల వేతనం రూ. 10వేలు కూడా దాటేదికాదు. కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి శాశ్వత, కాంట్రాక్టు ఆధ్యాపకులతో సమానంగా వీరు పని చేస్తున్నారు.  కాగా గత విద్యా సంవత్సరానికి సంబంధించి మూ డు నెలల బకాయి వేతనాలు ఇప్పటికీ అందలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్‌ వేతనాలను విడుదల చేయడంతో పాటు రెన్యూవల్‌ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

మా సేవలు గుర్తించడం లేదు..
-మహేష్‌, గెస్ట్‌ లెక్చరర్‌

విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మా సేవలు గుర్తించడంలేదు. కళాశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నప్పటికీ రెన్యూవల్‌పై ఉత్తర్వులు విడుదల చేయలేదు. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.  ప్రభుత్వం వెంటనే రెన్యూవల్‌ ఉత్తర్వులు జారీ చేయాలి.

ఐదేళ్లుగా పని చేస్తున్న..
- సుశీల్‌కుమార్‌, గెస్ట్‌ లెక్చరర్‌

ఐదేళ్లుగా గెస్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. ప్రభుత్వం మమ్మలను  రెన్యూవల్‌ చేయక పోవడంతో  తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నాం. ప్రస్తుతం చిన్న వ్యాపారం చేస్తున్నాను. అయినప్పటికీ ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ప్రభుత్వం మా కుటుంబాల పరిస్థితిని పరిగ ణలోకి తీసుకుని రెన్యూవల్‌ చేయాలి.