హార్దిక్‌, అక్షర్‌కు పిలుపు

ABN , First Publish Date - 2021-01-20T06:50:56+05:30 IST

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌ల్లో హార్దిక్‌ పాండ్యాకు అనూహ్యంగా చోటు దక్కగా.. గాయపడిన రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఆంధ్రా వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌ స్టాండ్‌బైగా సెలెక్టయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు

హార్దిక్‌, అక్షర్‌కు పిలుపు

విరాట్‌కు పగ్గాలు ఫ స్టాండ్‌బైగా కేఎస్‌ భరత్‌ ఫ పృథ్వీ, నట్టూ అవుట్‌

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు జట్టు ఎంపిక


న్యూఢిల్లీ: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌ల్లో హార్దిక్‌ పాండ్యాకు అనూహ్యంగా చోటు దక్కగా.. గాయపడిన రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఆంధ్రా వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌ స్టాండ్‌బైగా సెలెక్టయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్ట్‌లకు 18 మంది సభ్యుల భారత బృందాన్ని చేతన్‌ శర్మ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ మంగళవారం ఎంపిక చేసింది. వచ్చే నెల 5 నుంచి తొలి టెస్ట్‌ జరగనుంది. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో కోహ్లీ కూడా పాల్గొన్నాడు. పితృత్వ సెలవులో ఉన్న కోహ్లీ మళ్లీ టీమ్‌ పగ్గాలందుకోనుండగా.. ఫిట్‌నెస్‌ నిరూపించుకొన్న పేసర్‌ ఇషాంత్‌కు టీమ్‌లో చోటుదక్కింది.


గాయాలతో బ్రిస్బేన్‌ టెస్ట్‌కు దూరమైన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, స్పిన్నర్‌ అశ్విన్‌కు కూడా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. కాగా, హార్దిక్‌కు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా చోటు దక్కింది. గాయపడిన బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌.. తన ఫిట్‌నె్‌సను నిరూపించుకొంటే అతడికి కూడా టీమ్‌లో అవకాశం లభించనుంది. పేసర్‌ నటరాజన్‌తోపాటు ఓపెనర్‌ పృథ్వీ షాకు సెలెక్టర్లు మొండి చేయి చూపారు. స్టాండ్‌ బైగా భరత్‌తోపాటు జార్ఖండ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌, బెంగాల్‌ ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌, రాజస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ను ఎంపిక చేశారు. 


భారత జట్టు

ఓపెనర్లు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌. మిడిలార్డర్‌: చటేశ్వర్‌ పుజార, కోహ్లీ, రహానె, రిషభ్‌ పంత్‌, వృద్ధిమాన్‌ సాహా, హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ (తొలి టెస్ట్‌ తర్వాత ఫిట్‌నెస్‌ ఆధారంగా) 

పేసర్లు: బుమ్రా, ఇషాంత్‌, సిరాజ్‌, శార్దూర్‌ ఠాకూర్‌. 

స్పిన్నర్లు: అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌.  స్టాండ్‌బై: కేఎస్‌ భరత్‌, అభిమన్యు ఈశ్వరన్‌, షాబాజ్‌ నదీమ్‌, రాహుల్‌ చాహర్‌. నెట్‌ బౌలర్లు: అంకిత్‌ రాజ్‌పుత్‌, అవేశ్‌ ఖాన్‌, సందీప్‌ వారియర్‌,  కృష్ణప్ప గౌతమ్‌, సౌరభ్‌ కుమార్‌. 

Updated Date - 2021-01-20T06:50:56+05:30 IST