శ్రీశైలంలో కల్వరి టెంపుల్‌ పార్సిల్‌ బాక్స్‌ కలకలం

ABN , First Publish Date - 2020-09-24T21:49:54+05:30 IST

శ్రీశైలంలో కల్వరి టెంపుల్‌ పార్సిల్‌ బాక్స్‌ కలకలం రేగింది. శ్రీశైలం కొత్తపేటకు చెందిన వ్యక్తికి కల్వరిటెంపుల్‌ నుంచి పార్సిల్‌ వచ్చింది.

శ్రీశైలంలో కల్వరి టెంపుల్‌ పార్సిల్‌ బాక్స్‌ కలకలం

కర్నూలు: శ్రీశైలంలో కల్వరి టెంపుల్‌ పార్సిల్‌ బాక్స్‌ కలకలం రేగింది. శ్రీశైలం కొత్తపేటకు చెందిన వ్యక్తికి కల్వరిటెంపుల్‌ నుంచి పార్సిల్‌ వచ్చింది. శ్రీశైలం బస్టాండ్‌లో పార్సిల్‌ను స్థానికులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆలయ సీఎస్‌వోకి భక్తులు సమాచారమిచ్చారు. కల్వరి టెంపుల్‌ పార్సిల్‌ బాక్స్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే బాక్స్‌ను ఎస్తై హరిప్రసాద్ మీడియా సమక్షంలో తెరిచారు. అందులో నిత్యావసర వస్తువులున్నాయి. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2020-09-24T21:49:54+05:30 IST