యజమాని కోసం ఒంటె ఆరాటం!

ABN , First Publish Date - 2020-07-23T05:30:00+05:30 IST

జంతువులు విశ్వాసంగా ఉంటాయని తెలిసిందే. సాధారణంగా పెంపుడుకుక్కలు యజమానితో ఎక్కువ అనుబంధం ఏర్పరచుకుంటాయి. కానీ ఈ ఒంటె కథ తెలిస్తే ఔరా! అనకుండా ఉండలేరు...

యజమాని కోసం ఒంటె ఆరాటం!

జంతువులు విశ్వాసంగా ఉంటాయని తెలిసిందే. సాధారణంగా పెంపుడుకుక్కలు యజమానితో ఎక్కువ అనుబంధం ఏర్పరచుకుంటాయి. కానీ ఈ ఒంటె కథ తెలిస్తే ఔరా! అనకుండా ఉండలేరు. విషయమేమిటంటే మంగోలియాలో ఒకాయన ఒంటెలను పెంచుతూ జీవించేవాడు. ఆయన ఎనిమిది నెలల క్రితం తన దగ్గర ఉన్న ఓ ఒంటెను ఒకాయనకు అమ్మేశాడు. కానీ ఆ ఒంటె పాత యజమానిని విడిచి ఉండలేకపోయింది.  ఆయనను  చేరుకునేందుకు ఏకంగా ఎడారి మార్గంలో 100 కి.మీ దూరం నడిచింది.


మార్గమధ్యంలో గాయపడినా కూడా నడక ఆపలేదు. గాయపడిన ఆ ఒంటెను చూసి ఒక పశువుల కాపరి సహాయం చేశాడు. అలా ఎడారి మార్గం గుండా నడిచి చివరకు తన యజమానిని చేరుకుంది. తన కోసం అంత దూరం ప్రయాణించి వచ్చిన ఆ ఒంటెను యజమాని ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు.  

Updated Date - 2020-07-23T05:30:00+05:30 IST