Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్యాంప్‌ రాజకీయాలు షురూ!

ఎమ్మెల్సీ అభ్యర్థితో అధికార పార్టీ నేతల సమావేశం 

సభ్యులకు రూ. 50వేల నజరానా..? 

త్వరలో హైదరాబాద్‌కు తరలింపు

మంచిర్యాల, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంప్‌ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లతో రహస్య సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆదిలా బాద్‌ ఎమ్మెల్సీ స్థానంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి దండె విఠల్‌కు మద్దతు కూడగట్టేందుకు జిల్లా లోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీ కృషి చేస్తు న్నారు. ఏకగ్రీవం అవుతుందనుకున్న ఆదిలాబాద్‌ స్థానంలో ఊహించని విధంగా స్వతంత్ర అభ్యర్థిని పెందూర్‌ పుష్పరాణి బరిలో నిలవడంతో అధికార పార్టీకి చెందిన ఓటర్లు జారిపోకుండా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓటర్లకు నగదు నజరానాలతో పాటు క్యాంపులు ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

సమావేశమైన నాయకులు

జిల్లాలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోగల ఎంఎన్‌ఆర్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాలులో అధికార పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి మున్సిపల్‌ కౌన్సిలర్లతోపాటు టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులను ఆహ్వానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించే విధంగా  సమాయత్తం చేసే  ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగం మొదటి విడుతగా ఒక్కో ఓటర్‌కు రూ. 50 వేలు ముట్టజెప్పినట్లు సమాచారం. విడుతల వారీగా ఒక్కో ఓటర్‌కు రూ. 3 లక్షల వరకు ముట్టజెప్పేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. 

హైద్రాబాద్‌లో శిబిరం ఏర్పాటు

ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరుగనుం డగా ఆ లోపే ఓటర్లందరినీ క్యాంపునకు తరలించేం దుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అభ్యర్థి దండే విఠల్‌పై సొంత పార్టీ నాయకుల్లో వ్యతిరేకత ఉండటంతో ఓటర్లను మచ్చిక చేసుకునేం దుకు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. పోలింగ్‌ తేదీ వరకు వారిని క్యాంపుల్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండు, మూడు రోజుల్లో హైద్రాబాద్‌లోని ప్రత్యేక శిబిరానికి ఓటర్లను తరలించేందుకు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుంటు న్నారు. ఓటర్లను తిరిగి ఎన్నికలకు ముందు రాత్రి  తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

Advertisement
Advertisement