మొబైల్‌ని హ్యాక్‌ చేయొచ్చా?

ABN , First Publish Date - 2020-12-18T05:30:00+05:30 IST

ఒకప్పుడు మొబైల్‌ హ్యాక్‌ చేయాలంటే చాలా టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరమయ్యేది. కానీ ఇప్పుడు అనేక రెడీమేడ్‌ టూల్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

మొబైల్‌ని హ్యాక్‌ చేయొచ్చా?

ఎవరైనా మొబైల్‌ని హ్యాక్‌ చేయొచ్చా? చేయగలిగితే దానికి ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 

- కిషోర్‌ నాని, ఏలూరు

ఒకప్పుడు మొబైల్‌ హ్యాక్‌ చేయాలంటే చాలా టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరమయ్యేది.  కానీ ఇప్పుడు అనేక రెడీమేడ్‌ టూల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. చాలా సులభంగా ఆండ్రాయిడ్‌ లేదా ఐఫోన్లని హ్యాకింగ్‌  చేయడం సాధ్యపడతోంది.  నేరుగా మన ఫోన్‌ చేతిలోకి తీసుకోగలిగితే,  అందులో ప్రత్యేకమైన అప్లికేషన్‌ మనకు కనిపించకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అయ్యే విధంగా ఇన్‌స్టాల్‌ చేయటం ద్వారా హ్యాకింగ్‌ చేయొచ్చు. ఒకవేళ హ్యాకర్‌ వేరే ప్రదేశంలో ఉన్నట్లయితే,  వివిధ రకాల సోషల్‌ ఇంజనీరింగ్‌ పద్ధతులు అనుసరించడం ద్వారా మన ఫోన్‌ హ్యాక్‌ చేస్తారు. దీని కోసం మనల్ని మభ్యపుచ్చే విధంగా  పలురకాల లింకులు క్రియేట్‌ చేసి, వాటి ద్వారా ట్రాప్‌ చేస్తారు. హ్యాకింగ్‌ నుంచిమనల్ని మనం రక్షించుకోవాలంటే, మొట్టమొదట లింకులను క్లిక్‌ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పలురకాల ఆఫర్ల పేరుతో వచ్చే లింకులకి దూరంగా ఉండాలి. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తప్పించి ఇతరచోట్ల నుంచిఅప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకోకూడదు. కొంతమంది యాంటీవైరస్‌ ఉంటే మంచిది అని భావిస్తుంటారు. మీ ఫోన్లో యాంటీ వైరస్‌ ఉన్నా కూడా హ్యాకింగ్‌ పేలోడ్‌లను ఎట్టి పరిస్థితుల్లో గుర్తించలేదు. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండటమే మంచిది.

Updated Date - 2020-12-18T05:30:00+05:30 IST