Advertisement

నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ డ్యాన్స్ వీడియోలో ఉన్న టాప్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టగలరా..?

ఇంటర్నెట్ యుగంలో రోజుకొక ఛాలెంజ్ పుట్టుకొస్తుంటుంది. గతంలో ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్, రియల్ మెన్ ఛాలెంజ్ వంటివి చూశాం. తాజాగా నెట్టింట్లో మరొక ఛాలెంజ్ ఫేమస్ అయింది. ఈ ఛాలెంజ్‌లో మహిళలందరూ పోటీపడి పాల్గొంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో ‘‘ ఉమెన్ డాన్స్ ఛాలెంజ్’’ వైరల్ అవుతోంది. ఆ ఛాలెంజ్‌లో ఒక హీరోయిన్ మరొ ఇద్దరూ డ్యానర్స్‌తో కలిసి పాల్గొన్నారు. 


లోఫర్ చిత్రంలో నటించి టాలీవుడ్‌లోకి ప్రవేశించిన దిశా పటానీ ఆ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తల మీద క్యాప్ పెట్టుకుని, ముఖం కనిపించకుండా డ్యాన్స్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోకు నెటిజన్లు ఎమోజీల రూపంలో తమ స్పందనను తెలియజేస్తున్నారు. 


దిశా పటానీ చివరంగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన రాధే: ది మోస్ట్ వాంటెడ్ భాయ్ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించారు. ఆమెకు సల్మాన్‌తో రెండో చిత్రమిది. గతంలో వీరిద్దరూ కలిసి ‘‘ భారత్ ’’ మూవీలో కనిపించారు. ఎమ్ఎస్.ధోని అన్ టోల్డ్ స్టోరి, కుంగ్ పూ యోగా, మలంగ్ తదితర చిత్రాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం ఆమె ఏక్ విలన్-2 చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన నటిస్తున్నారు.


Advertisement

Bollywoodమరిన్ని...