రాత్రిపూట పండ్లు మాత్రమే తినొచ్చా?

ABN , First Publish Date - 2021-02-26T20:19:54+05:30 IST

సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల ఆహారం అవసరం. శరీరానికి కావాల్సిన పోషకాలను సరైన పాళ్ళలో తీసుకోవాలి. దీనికోసం తగు మోతాదులో రకరకాల ధాన్యాలు, పప్పులు, మాంసాహారులైతే గుడ్లు, మాంసం లేదా పాలు, పాల ఉత్పత్తులు, రకరకాల కూరగాయలు

రాత్రిపూట పండ్లు మాత్రమే తినొచ్చా?

ఆంధ్రజ్యోతి(26-02-2021)

ప్రశ్న: నేను నెల రోజులుగా అన్నం పూర్తిగా మానేశాను. రాత్రి భోజనానికి బదులు కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటున్నాను. దీనివల్ల ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది వస్తుందా?


- సూర్య, విశాఖపట్నం 


డాక్టర్ సమాధానం: సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల ఆహారం అవసరం. శరీరానికి కావాల్సిన పోషకాలను సరైన పాళ్ళలో తీసుకోవాలి. దీనికోసం తగు మోతాదులో రకరకాల ధాన్యాలు, పప్పులు, మాంసాహారులైతే గుడ్లు, మాంసం లేదా పాలు, పాల ఉత్పత్తులు, రకరకాల కూరగాయలు, పండ్లు అన్నీ తీసుకోవాలి. ఏ పోషకాలనైనా పూర్తిగా మానేసినా లేదా అధికంగా తీసుకున్నా దీర్ఘకాలంలో సమస్యలొస్తాయి. అన్నం మానేసినప్పుడు దాని స్థానంలో వేరే ఏదైనా ధాన్యాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అన్నానికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలు, గోధుమలు, తృణ ధాన్యాలను వాడవచ్చు. రాత్రిపూట మితంగా భుజించడం మంచిదే. అయితే చక్కెరలు అధికంగా ఉండే పండ్లను అధిక మొత్తంలో రాత్రిపూట తీసుకోవడం, వాటితో పాటు ఎలాంటి ప్రొటీన్లు తీసుకోకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజు స్థాయిల్లో తేడాలు వస్తాయి. ఆహారపు అలవాట్ల పరంగా పెద్ద మార్పులు చేసుకునే ముందు పోషకాహార నిపుణులను సంప్రదించి వారి సలహా మేరకు పాటించాలి. దీనివల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా నివారించవచ్చు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-02-26T20:19:54+05:30 IST