ఎస్‌డి కార్డ్‌ నుంచిడేటాని పొందొచ్చా?

ABN , First Publish Date - 2020-12-18T05:30:00+05:30 IST

మీ మెమరీ కార్డులో అది ఫార్మాట్‌ అయిన తరవాత ఈ రెండు నెలల్లో కొత్తగా ఎలాంటి డేటా కాపీ చేయకపోతే చాలావరకు డేటాను వెనక తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది.

ఎస్‌డి కార్డ్‌ నుంచిడేటాని పొందొచ్చా?

నా మెమరీ కార్డు రెండు నెలల క్రితం ఫార్మాట్‌ అయింది. ఇప్పుడు నేను ఆ ఎస్‌డి కార్డ్‌ నుంచిడేటాని తిరిగి వెనక్కి పొందొచ్చా? 

ప్రవీణ్‌ కుమార్‌.జి, అనంతపురం

మీ మెమరీ కార్డులో అది ఫార్మాట్‌ అయిన తరవాత ఈ రెండు నెలల్లో కొత్తగా ఎలాంటి డేటా కాపీ చేయకపోతే చాలావరకు డేటాను వెనక తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు కొత్తగా పెద్ద మొత్తంలో ఫైళ్లు, కాపీ చేసి,  డిలీట్‌ చేసి ఉన్నట్లయితే తిరిగి వాటిని పొందే అవకాశం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే గతంలో డిలీట్‌ చేసిన డేటా మీద కొత్తగా మీరు సేవ్‌ చేసిన ఫైళ్లు రైట్‌ అవుతాయి. రెండు నెలల నుంచిమీ మెమరీ కార్డు వాడకుండా పక్కన పడేసినట్లయితే, కచ్చితంగా మీ డేటా వెనక్కు వస్తుంది.  మీరు చేయవలసిందల్లా మీ మెమరీ కార్డుని కార్డ్‌ రీడర్‌ ద్వారా పీసీకి కనెక్ట్‌ చేసి,  విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కోసం అందుబాటులో ఉన్న అనేక ఉచిత లేదా పెయిడ్‌ డేటా రికవరీ అప్లికేషన్లు ప్రయత్నించవచ్చు. యాక్టివ్‌ అన్‌డిలీట్‌, ఈసస్‌ డేటా రికవరీ వంటి అప్లికేషన్లు లభిస్తాయి.

Updated Date - 2020-12-18T05:30:00+05:30 IST