ఎస్‌బీఐ ఖాతాదారులకు కొత్త రకాల సేవలు

ABN , First Publish Date - 2021-01-17T23:43:52+05:30 IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు కొత్త రకాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటిలో ఫ్లెక్సీ డిపాటిజ్ స్మీమ్ కూడా ఒకటి. దీని ద్వారా ప్రతి నెల మనకు సాధ్యమైనంత మొత్తాన్నే డిపాజిట్ చేయొచ్చు. ఇందులో ఒకేసారి డబ్బు జమచేయాలన్న రూల్ ఏమీ లేదు. ఫ్లెక్సీ డిపాజిట్ స్మీంలో ఏ సమయంలోనౌనా డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు. నెలకు రూ. 5 వేల నుంచి గరిష్టంగా రూ..50 వేల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.

ఎస్‌బీఐ ఖాతాదారులకు కొత్త రకాల సేవలు

హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు కొత్త రకాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటిలో ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. దీని ద్వారా ప్రతి నెల డిపాజిట్‌దారులు సాధ్యమైనంత మొత్తాన్నే డిపాజిట్ చేయొచ్చు. ఇందులో ఒకేసారి డబ్బు జమ చేయాలన్న రూల్ ఏమీ లేదు. ఫ్లెక్సీ డిపాజిట్ స్కీంలో ఏ సమయంలోనైనా డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు. నెలకు కనీసం 500 రూపాయలు డిపాజిట్ చేయవచ్చు. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 5 వేల నుంచి గరిష్టంగా రూ.50 వేల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ డిపాజిట్  స్కీమ్‏లో చేరితే కనీసం ఐదు సంవత్సరాల డబ్బు డిపాజిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏడు సంవత్సరాల వరకు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే... టర్మ్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేటు ఈ ఫ్లెక్సీ పథకానికి కూడా వర్తిస్తుంది. ఇందులో 5.4 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఇక సీనియర్ సిటిజన్ల‏కు మాత్రం 0.5 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇక వినియోగదారులు తమ ఫ్లెక్సీ అకౌంట్‏లో ఉన్న డబ్బుపై 90 శాతం మొత్తాన్ని రుణం కింద తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. 

Updated Date - 2021-01-17T23:43:52+05:30 IST