కేన్సర్‌ రాకుండా చూసుకోవచ్చా?

ABN , First Publish Date - 2020-02-08T05:30:00+05:30 IST

కేన్సర్‌ వ్యాధి ఈ మధ్య బాగా పెరిగింది. ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నా చాలామందిలో భయం ఉంటోంది. చికిత్స సమయంలో ఎలాంటి డైట్‌ తీసుకోవాలి. కేన్సర్‌ రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉందా?

కేన్సర్‌ రాకుండా చూసుకోవచ్చా?

కేన్సర్‌ వ్యాధి ఈ మధ్య బాగా పెరిగింది. ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నా చాలామందిలో భయం ఉంటోంది. చికిత్స సమయంలో ఎలాంటి డైట్‌ తీసుకోవాలి. కేన్సర్‌ రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉందా? 

- తరుణి, హైదరాబాద్‌

ఏటా ఫిబ్రవరి 4న ‘కేన్సర్‌ డే’ నిర్వహిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం కేన్సర్‌ వ్యాధిపై ఉన్న అపోహలు తొలగించి, అవగాహన పెంచడం. కేన్సర్‌ ఒక భయంకరమైన జబ్బు అని, దాని నుంచి బయట పడడం అసాధ్యం అన్న అపోహ తొలగిపోవాలని ‘కేన్సర్‌ డే’ జరుపుతారు. ప్రతి నాలుగేళ్లకి ఒక థీమ్‌ ఉంటుంది దాని బట్టి హాస్పిటల్స్‌,  డైటీషియన్స్‌, సోషల్‌ కేర్‌ గ్రూప్స్‌ పలురకాల కార్యక్రమాలు చేస్తుంటాయి. ఈ ఏడాది థీమ్‌ ‘‘ఐయామ్‌ అండ్‌ ఐ విల్‌’’. దీని ముఖ్య ఉద్దేశం కేన్సర్‌ వచ్చిన వారిలో ధైర్యాన్ని నింపడం. తద్వారా కేన్సర్‌ చికిత్స సవ్యంగా సాగుతుంది. త్వరగా కోలుకుంటారు కూడా. అవగాహనా ఉండటం వల్ల, బాధను తట్టుకోవడం, చికిత్సకు సహకరించడం జరగుతుంది. అనుకున్న టైమ్‌కు చికిత్స పూర్తయి, కోలుకునే అవకాశం ఉంటుంది. అవగాహన వల్ల ఎంతో మంది కేన్సర్‌ నుంచి బయటపడి సాధారణ జీవితం గడుపుతున్నారు. 

కేన్సర్‌ అంటు వ్యాధి కాదు. అయితే జీన్స్‌ వల్ల వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. జీన్స్‌ ట్రిగ్గర్‌ అయినప్పుడే కేన్సర్‌ పుడుతుంది. ట్రిగ్గరింగ్‌ ఫ్యాక్టర్స్‌లో మనం కంట్రోల్‌ చేసుకునేవి కొన్ని, మన కంట్రోల్‌లో లేనివి కొన్ని ఉంటాయి. 


కేన్సర్‌ చికిత్స సమయంలో తీసుకోవాల్సిన ఆహార నియమాలు 

హై ఎనర్జీ, హై ప్రోటీన్‌ అవసరం ఉంటుంది. కేన్సర్‌ రకం, చికిత్సన బట్టి డైట్‌ ప్లాన్‌ ఎంపిక చేసుకోవాలి. నిపుణుల సలహాలు తీసుకోవాలి. 

కీమో, రేడియో థెరపీలు జరుగుతున్నపుడు ఫ్లూయిడ్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. గంజి నీళ్ళు అన్నిటికన్నా శ్రేష్ఠం. పండ్లరసాలు, సూప్స్‌, కొబ్బరి నీళ్లు, మజ్జిగ బాగా ఎంతో ఉపయోగపడతాయి.

ఎక్కువ ఘాటు, కారం, మసాలా, పులుపు పడకపోవచ్చు. కాబట్టి బాగా తగ్గించాలి. 

విశ్రాంతి కోసం ప్రశాంత వాతావరణంలో గడపాలి.

గొంతులో మంట, వాంతులు, చర్మం పొడిబారడం, ఆకలి లేకపోవడం, జుట్టు రాలి పోవడం చాలా సాధారణం. అవగాహనతో వాటిని యాక్సెప్ట్‌ చేసి తగిన జీవనవిధానం అలవాటు చేసుకోవాలి. 


నివారణ : 

కేన్సర్‌ ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. రాకుండా ఉండటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. 

ప్రశాంత జీవనం గడపాలి. సమయానికి భోజనం చేయాలి. అలాగే వేళకు నిద్రపోవాలి. మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవాలి.

ఒత్తిడి తగ్గించుకోవాలి.  ప్రతి చిన్న  విషయాన్ని బూతద్దంలో చూడటం మానేయాలి. 

సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినాలి. ఆర్గానిక్‌ ఫుడ్‌ తీసుకుంటే మరీ మంచిది. 

వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

Updated Date - 2020-02-08T05:30:00+05:30 IST