Abn logo
Sep 22 2021 @ 17:19PM

భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన మరో దేశం..

ఒట్టావా: భారత విమానాలపై ఉన్న బ్యాన్‌ను కెనడా మరోసారి పొడిగించింది. ఈ నెల 26 వరకు భారత్ నుంచి వచ్చే అన్ని డైరెక్ట్ విమానాలపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. బుధవారం భారత్ నుంచి కెనడాకు మూడు విమానాలు షెడ్యూల్ చేయబడిన తరుణంలో ట్రాన్స్‌పోర్ట్ కెనడా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ మూడు విమానాల్లో వచ్చే ప్రయాణికులకు కెనడాలో దిగిన తర్వాత తప్పనిసరిగా కరోనా టెస్టు ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు ట్రాన్స్‌పోర్ట్ కెనడా తన అధికారిక వెబ్‌సైట్ బుధవారం కీలక ప్రకటన చేసింది.


"కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తొలిగిపోలేదు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల ప్రయాణికుల ప్రవేశానికి ఇప్పుడే అనుమతి ఇవ్వడం తొందరపాటు చర్య అవుతుంది. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి వచ్చే అన్ని వాణిజ్య, ప్రైవేట్ ప్యాసెంజర్ విమానాలపై సెప్టెంబర్ 26, రాత్రి 23.59 గంటల వరకు నిషేధం కొనసాగుతుంది. దేశ ప్రజల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది." అని ట్రాన్స్‌పోర్ట్ కెనడా చెప్పుకొచ్చింది. ఈ బ్యాన్ ముగిసిన వెంటనే ఇండియా నుంచి వచ్చే డైరెక్ట్ విమానాలకు కెనడాలో అనుమతి ఉంటుందని పేర్కొంది. 

ఇక నిషేధం ముగిసిన తర్వాత కెనడాకు తిరిగొచ్చే భారత ప్రయాణికులకు ఈ సందర్భంగా కొన్ని కీలక సూచనలు చేసింది.

* ప్రయాణికులు తప్పనిసరిగా కెనడాకు బయల్దేరడానికి 18 గంటల ముందు ఢిల్లీ విమానాశ్రయంలోని జెన్‌స్ట్రింగ్ లాబొరేటరీ నుంచి తీసుకున్న కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.   

* బోర్డింగ్‌కు ముందే విమాన సంస్థలు ప్రయాణికుల కరోనా టెస్టు ఫలితాన్ని చెక్ చేసి, వారు కెనడా ప్రయాణానికి అర్హులా? కాదా? అనే విషయాన్ని సరి చూసుకోవాలని కోరింది. అలాగే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు దాని తాలుకూ సర్టిఫికేట్‌ను ArriveCAN మొబైల్ యాప్‌లో లేదా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపింది. ఈ షరతులకు లోబడి మాత్రమే ప్రయాణికులను బోర్డింగ్‌కు అనుమతి ఇవ్వాలని కెనడా ట్రాన్స్‌పోర్ట్ పేర్కొంది. లేనిపక్షంలో ప్రయాణికులను బోర్డింగ్‌కు అనుమతించకూడదని స్పష్టం చేసింది.      

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...