Hyderabad కు చెందిన అక్కాచెల్లెళ్లకు కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని..

ABN , First Publish Date - 2021-08-10T14:37:36+05:30 IST

కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి నగరానికి చెందిన అక్కాచెల్లెళ్ల

Hyderabad కు చెందిన అక్కాచెల్లెళ్లకు కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని..

హైదరాబాద్‌ సిటీ : కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి నగరానికి చెందిన అక్కాచెల్లెళ్ల నుంచి రూ. 50.32 లక్షలు కాజేసిన నైజీరియన్‌ సైబర్‌ నేరగాడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. కుషాయిగూడ ప్రాంతానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఉన్నత చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి విదేశాల్లో ఉద్యోగాలు కావాల్సిన వారు సంప్రందించాలని ప్రచారం చేసుకున్నాడు. అలా సైబర్‌ నేరగాళ్లకు చిక్కిన అక్కాచెల్లెళ్లు వివిధ రకాల ఫీజుల పేరుతో రూ. 50.32 లక్షలు సమర్పించుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని గ్రహించి రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలు సేకరించి బెంగళూరులో ఉంటూ సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న నైజీరియన్‌ డేనియల్‌ అబ్జానోను అరెస్టు చేశారు.

Updated Date - 2021-08-10T14:37:36+05:30 IST