Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 30 2021 @ 08:24AM

Canada వెళ్లే భారతీయులకు శుభవార్త

కోవాక్సిన్ టీకాలు వేసుకునే ప్రయాణికులకు నేటినుంచి అనుమతి

న్యూఢిల్లీ: కెనడా దేశానికి వెళ్లే భారతీయులకు శుభవార్త... కరోనావైరస్ వ్యాధికి వ్యతిరేకంగా భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకాలు వేయించుకున్న వ్యక్తులకు కెనడా మంగళవారం నుంచి ప్రవేశం కల్పిస్తోంది.హైదరాబాద్‌కు చెందిన కంపెనీ వ్యాక్సిన్‌కు నవంబర్ 19న అనుమతి లభించింది. కెనడా దేశంలో ప్రయాణానికి టీకా తప్పనిసరి అని కెనడా ప్రభుత్వం ప్రకటించింది.కెనడా దేశంలోకి ప్రవేశించే ప్రయాణికులు టీకాలు పొందితే వారు ప్రీ ఎంట్రీ మాలిక్యులర్ పరీక్ష నమూనా సమర్పించాల్సిన అవసరం లేదని కెనడా ప్రభుత్వం తెలిపింది. 


కెనడాలో ప్రయాణం చేయాలంటే ప్రభుత్వం ఆమోదించిన వ్యాక్సిన్లలో రెండు డోసులు లేదా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఒక డోసు పొంది ఉండాలని కెనడా సర్కారు పేర్కొంది.భారత్ బయోటెక్‌తో పాటు, కొవిడ్-19కి వ్యతిరేకంగా చైనా యొక్క సినోఫార్మ్, సినోవాక్ వ్యాక్సిన్‌లను కూడా కెనడా ఆమోదించింది.

Advertisement
Advertisement