కొత్త బీరుకు ఆ పేరు పెట్టిన కంపెనీ.. విషయం తెలిసి క్షమాపణ

ABN , First Publish Date - 2020-08-10T02:20:48+05:30 IST

కెనడాకు చెందిన హెల్స్ బేస్‌మెంట్ బీర్ కంపెనీ ఓ కొత్త బీర్‌ను కనిపెట్టింది. అయితే దానికి ఓ కొత్త పేరు పెట్టాలని అనుకుంది. ప్రజలను ఆకర్షించేలా...

కొత్త బీరుకు ఆ పేరు పెట్టిన కంపెనీ.. విషయం తెలిసి క్షమాపణ

ఒట్టావా: కెనడాకు చెందిన హెల్స్ బేస్‌మెంట్ బీర్ కంపెనీ ఓ కొత్త బీర్‌ను కనిపెట్టింది. అయితే దానికి ఓ కొత్త పేరు పెట్టాలని అనుకుంది. ప్రజలను ఆకర్షించేలా ఉండాలని  ‘హురుహురు’ అనే పేరు పెట్టింది. ఈ పేరుకు మావోరీ భాషలో తేలికైన ఈక అనే అర్థం వస్తుందని కంపెనీ భావించింది. అయితే మావోరీ టీవీలో పనిచేసే ఓ వ్యక్తి ఈ పదానికి అసలైన అర్థాన్ని ఓ ఫేస్‌బుక్ వీడియో ద్వారా వివరించారు. ఈ పేరుకు మావోరీ భాషలో మర్మాంగం వద్ద ఉండే వెంట్రుకలు అనే అర్థం వస్తుందని, కంపెనీ ఈ పేరుపై పునరాలోచించాలని సూచించారు. దీంతో సదరు కంపెనీ వినియోగదారులకు కంపెనీ క్షమాపణ చెప్పింది. అంతేకాకుండా కొత్త పేరును పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2020-08-10T02:20:48+05:30 IST