బిట్ కాయిన్లలో జీతాల చెల్లింపు..బాస్కెట్ బాల్ లీగ్ నిర్ణయం

ABN , First Publish Date - 2021-06-20T03:58:33+05:30 IST

బాస్కెట్ బాల్ క్రీడాకారుల జీతాల్లో కొంత మొత్తాన్ని బిట్ కాయిన్లలో చెల్లిస్తామని కెనడా ఎలీట్ బాస్కెట్ బాల్ లీగ్ తాజాగా వెల్లడించింది.

బిట్ కాయిన్లలో జీతాల చెల్లింపు..బాస్కెట్ బాల్ లీగ్ నిర్ణయం

ఒట్టోవా: బాస్కెట్ బాల్ క్రీడాకారుల జీతాల్లో కొంత మొత్తాన్ని బిట్ కాయిన్లలో చెల్లిస్తామని కెనడా ఎలీట్ బాస్కెట్ బాల్ లీగ్ తాజాగా వెల్లడించింది. అయితే..బిట్‌కాయిన్‌లో పారితోషికాన్ని స్వీకరించాలా వద్దా అనేది నిర్ణయించుకునే స్వేఛ్చను ఆటగాళ్లకే వదిలేసింది. ఇప్పటివరకూ వారు డాలర్లలో తమ జీతాన్ని పొందుతున్నారు. బిట్‌కాయిన్లకు వారి అంగీకరిస్తే.. సంస్థ ముందుగా డాలర్లలో ఉన్న సొమ్మును బిట్ కాయిన్లలోకి మార్చి ఆ మొత్తాన్ని క్రీడాకారుల క్రిప్టోకరెన్సీ వాలెట్‌లో జమ చేస్తుంది. కాగా.. భవిష్యత్తు క్రిప్టోకరెన్సీలదే అని చెప్పేందుకు ఇది తాజాగా ఉదాహరణ అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఎల్ శాల్వడార్ అనే దేశం క్రిప్టోకరెన్సీలకు తమ దేశంలో చట్టబద్ధత కల్పిస్తూ చెల్లింపులకు అనుమతిచ్చింది. కొన్ని టెక్ కంపెనీలు కూడా డిజిటల్ కరెన్సీలలో లావాదేవీలకు అంగీకరిస్తున్నాయి. అయితే..వివిధ దేశాల్లోని కేంద్ర బ్యాంకులు మాత్రం క్రిప్టోకరెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరిస్తున్నాయి. వీటికి చట్టబద్ధత కల్పించేందుకు అధిక శాతం ప్రభుత్వాలు జంకుతున్నాయి. 

Updated Date - 2021-06-20T03:58:33+05:30 IST