కెనరా బ్యాంక్‌ వడ్డీ రేట్ల తగ్గింపు

ABN , First Publish Date - 2020-04-07T05:46:02+05:30 IST

ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్‌.. రెపో అనుసంధానిత వడ్డీ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) 0.75 శాతం, ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత వడ్డీ రేటు 0.35 శాతం తగ్గించినట్టు...

కెనరా బ్యాంక్‌ వడ్డీ రేట్ల తగ్గింపు

ముంబై : ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్‌.. రెపో అనుసంధానిత వడ్డీ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) 0.75 శాతం, ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత వడ్డీ రేటు 0.35 శాతం తగ్గించినట్టు ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయి. ఈ తగ్గింపుతో ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 7.30 శాతానికి, ఏడాది కాలపరిమితి గల ఎంసీఎల్‌ఆర్‌ 7.85 శాతానికి దిగివచ్చాయి. ఇవి కాకుండా 6 నెలల ఎంసీఎల్‌ఆర్‌ 0.30 శాతం తగ్గి 7.80 శాతానికి చేరగా 3 నెలల ఎంసీఎల్‌ఆర్‌ 0.20 శాతం తగ్గి 7.75 శాతం అయింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి సిండికేట్‌ బ్యాంక్‌ విలీనం అయినందు వల్ల ఈ కొత్త వడ్డీ రేట్లు విలీనంతో ఏర్పడిన కొత్త బ్యాంకుకే వర్తిస్తాయని పేర్కొంది.

Updated Date - 2020-04-07T05:46:02+05:30 IST