మూడు రాజధానుల రద్దు నిర్ణయంపై అనిశ్చితి: కేశవ్

ABN , First Publish Date - 2021-11-22T23:01:28+05:30 IST

మూడు రాజధానుల రద్దు నిర్ణయంపై మరింత అనిశ్చితి ఏర్పడిందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు.

మూడు రాజధానుల రద్దు నిర్ణయంపై అనిశ్చితి: కేశవ్

అమరావతి: మూడు రాజధానుల రద్దు నిర్ణయంపై మరింత అనిశ్చితి ఏర్పడిందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. మళ్లీ మెరుగైన బిల్లు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనతో మరింత అనిశ్చితి నెలకొంటుందన్నారు. కోర్టులో వాదనలు కొలిక్కి వస్తున్నాయని, తీర్పు వచ్చే సమయం దగ్గర పడిందని తెలిపారు. అన్ని లెక్కలు వేసుకునే ఈ సమయంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. మెరుగైన బిల్లు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలతో మరింత గందరగోళం ఏర్పడిందన్నారు. 3 రాజధానులు అనాలోచిత నిర్ణయానికి బాద్యులు ఎవరు? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు జరిగిన నష్టానికి ఎవరు సమాధానం చెపుతారని నిలదీశారు. గతంలో చేసిన చట్టాలు తప్పు అని జగన్ అంగీకరించినట్లేనని కేశవ్ పేర్కొన్నారు.

Updated Date - 2021-11-22T23:01:28+05:30 IST