Abn logo
Sep 24 2021 @ 23:43PM

సీపీఎస్‌ను రద్దు చేయండి

పెనుకొండ, సెప్టెంబరు 24: ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక దర్గాపేటలోని ప్రాథమిక పాఠశాలలో ఏపీటీఎఫ్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వం బకాయిపడ్డ డీఏ, పీఆర్‌సీలను వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు సీపీఎస్‌ వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మండల శాఖ నూతన కార్యవర్గం అధ్యక్షునిగా రుద్రేశ, ప్రధాన కార్యదర్శిగా రామాంజినేయులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు రఘునాథ్‌రావు, సీనియర్‌ ఉపాధ్యాయులు రంగప్ప, సత్యనారాయణరెడ్డి, సత్యనారాయణ, సంజీవరాయుడు, మూడు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.