మూడు నెలలుగా రేషన్ తీసుకోవడంలేదా? అయితే కార్డు కట్..

ABN , First Publish Date - 2021-09-16T17:35:41+05:30 IST

వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోవడంలేదా? అయితే వాలంటీర్ ఇంటికి వస్తాడు. ఆ మరుసటి రోజే...

మూడు నెలలుగా రేషన్ తీసుకోవడంలేదా? అయితే కార్డు కట్..

అమరావతి: వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోవడంలేదా? అయితే వాలంటీర్ ఇంటికి వస్తాడు. ఆ మరుసటి రోజే రేషన్ కార్డు కట్ అవుతుంది. కూలీ పనులకు ఇతర ప్రాంతాలకు వలస వెళుతూ.. రేషన్ తీసుకోకపోయినా వారి కార్డు వెంటనే తొలగింపు జాబితాలోకి చేరిపోతుంది. అలాగే ఏ కుటుంబంలోనైనా ప్రభుత్వ పథకం అందుకున్నా.. వారి రేషన్ కార్డు ప్రమాదంలో పడినట్లే. కుటుంబంలోని వ్యక్తులు మరణించినప్పటికీ ప్రభుత్వానికి చెప్పకుండా దాచారని తెలిసిందో.. వారి కార్డు ఇబ్బందుల్లో చిక్కుకున్నట్టే. నిన్నటి వరకు పెన్షన్లపై దృష్టి సారించి అనర్హుల పేరుతో తొలగిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు రేషన్ కార్డులపై దృష్టి పెట్టింది. తొలగింపు ప్రక్రియ షురూ చేసింది. ఏపీలో 8 నుంచి 10 లక్షల వరకు రేషన్ కార్డుల తొలగింపు ఖాయమని చెబుతున్నారు.

Updated Date - 2021-09-16T17:35:41+05:30 IST