కేరళ వెనక్కుతగ్గకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: ఐఎమ్ఏ

ABN , First Publish Date - 2021-07-19T05:11:47+05:30 IST

బక్రీద్ సందర్భంగా కరోనా ఆంక్షలను సడలించాలనే కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని భారత వైద్యుల సంఘం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) తీవ్రంగా వ్యతిరేకించింది.

కేరళ వెనక్కుతగ్గకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: ఐఎమ్ఏ

తిరువనంతపురం: బక్రీద్ సందర్భంగా కరోనా ఆంక్షలను సడలించాలనే కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని భారత వైద్యుల సంఘం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ క్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించింది. ‘‘ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది’’ అని ఐఎమ్ఏ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజారోగ్యపరంగా అత్యవసర స్థితి కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో కేరళ ప్రభుత్వం బక్రీద్ కోసం కరోనా ఆంక్షలను సడలించడం సబబు కాదని ఐఎమ్ఏ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

Updated Date - 2021-07-19T05:11:47+05:30 IST