పెంచిన పన్నులను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-06-24T05:42:40+05:30 IST

పెంచిన ఆస్తిపన్ను, డ్రైనేజీ, చెత్తపన్ను భారాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక దిబ్బలరోడ్డులో బు ధవారం సాయంత్రం ఆస్తిపన్ను వ్యతిరేక ఐక్య కార్యచరణ కమిటీ, పౌరసం ఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

పెంచిన పన్నులను రద్దు చేయాలి
దిబ్బలరోడ్డులో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతినిధులు

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 23 : పెంచిన ఆస్తిపన్ను, డ్రైనేజీ, చెత్తపన్ను భారాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక దిబ్బలరోడ్డులో బు ధవారం సాయంత్రం ఆస్తిపన్ను వ్యతిరేక ఐక్య కార్యచరణ కమిటీ, పౌరసం ఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయా సంఘాల నాయకులు జి.రమేష్‌, మారెళ్ల సుబ్బారావు మాట్లా డుతూ ప్రభుత్వ అదేశాల మేరకు ఒంగోలు నగర  పాలక సంస్థలో 196,197 జీవోల ద్వారా ఆస్తిపన్ను పెంచారని, దానిని రద్దు చేయాలని డిమాండ్‌ చే శారు. డ్రైనేజీపన్ను రూ.40, చెత్తపన్ను రూ.120 నిర్ణయించారని విమర్శించా రు. ఈ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమం లో జి.భీష్మారావు, మాలకొండయ్య, పావని  సుబ్బారావు, కె.రమాదేవి, జి.ఆది లక్ష్మి, కె.రాజేశ్వరి, జి.కళ్యాణి, పి.విజయ్‌కుమార్‌, కె.గురుస్వామి, కె.కోటిలింగా చారి, డి.ఏడుకొండలు, దర్నాసి కోటయ్య, మేడికొండ సుబ్బారావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-24T05:42:40+05:30 IST