Advertisement
Advertisement
Abn logo
Advertisement

13, 14, 15వ తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల: ఈ నెల 13, 14, 15వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతిలో ఈనెల 14న ద‌క్షిణాది రాష్ట్రాల సీఎంల భేటీ దృష్ట్యా.. వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ  రద్దు చేసింది. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే మూడ్రోజుల పాటు దర్శన టిక్కెట్లను టీటీడీ జారీ చేయనుంది. ఈనెల 14న తిరుపతిలో 29వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ కార్యక్రమం (దక్షిణాది రాష్ట్రాల సదస్సు) జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగే ఈ సదస్సుకు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్‌ నికోబార్‌దీవులు, లక్షద్వీప్ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లు పాల్గొంటారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement