Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీటీడీ ఆన్‌లైన్‌లో ఉచిత దర్శనం టోకెన్లు.. ఎప్పటినుంచి అంటే..!

తిరుపతిలో ఉచిత టోకెన్ల జారీకి స్వస్తి 

నేటి ఉదయం 6 గంటలకు పూర్తి కానున్న ఉచిత టోకెన్ల జారీ


తిరుపతి(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఆన్‌లైన్‌లో ఉచిత దర్శనం టోకెన్లను 26వ తేదీ నుంచి కేటాయిస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి తిరుపతిలో టోకెన్ల జారీ ఆగిపోనుంది. 23వ తేది ఆగిపోవటం ఏమిటనే ఆశ్చర్యం కలగవచ్చు. నిజానికి బుధవారం రాత్రి 9 గంటలకు 25వ తేదీకి సంబంధించిన టోకెన్లు మూడువేలు కేటాయించేశారు. ఎనిమిది వేలలో ఇక మిగిలింది అయిదువేలు మాత్రమే. ఈ అయిదువేలు కూడా గురువారం ఉదయం 6 గంటల్లోపు కేటాయించేస్తారు. దీంతో గురువారం నుంచే తిరుపతిలో ఉచిత టోకెన్ల జారీ ఆగిపోతోంది. ఈ విషయం తెలియక గురు, శుక్ర, శనివారాలు తిరుపతికి రానున్న శ్రీవారి భక్తులకు ఎలాంటి దర్శనం టోకెన్లు తిరుపతిలో లభ్యమయ్యే పరిస్థితి లేదు.


ఇదిలా ఉంటే బుధవారం శ్రీనివాసంలో వేలాదిమంది భక్తులు చేరుకున్నారు. గురు, శుక్ర, శనివారాలకు సంబంధించిన టోకెన్లను టీటీడీ జారీ చేసింది. శనివారం వరకు టోకెన్లు అయిపోయిన విషయం తెలియక గురు, శుక్ర, శనివారాల్లో తిరుపతికి రానున్న భక్తులకు టీటీడీ మరిన్ని సర్వదర్శనం టోకెన్లను జారీ చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. లేదంటే అంతదూరం నుంచి వచ్చే భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. మరోవైపు టోకెన్లు అందుబాటులో లేవనే బోర్డులను శ్రీనివాసం వద్ద గురువారం ఉదయమే టీటీడీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే సమాచారం తెలియకుండా భక్తుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.

TAGS: TTD
Advertisement
Advertisement