కరోనా టెస్టులో నెగిటివ్ వచ్చినా ఆస్పత్రిలోనే ఉరేసుకున్న యువకుడు

ABN , First Publish Date - 2020-07-09T21:50:39+05:30 IST

కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని తేలినప్పటికీ ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన వైనమిది...

కరోనా టెస్టులో నెగిటివ్ వచ్చినా ఆస్పత్రిలోనే ఉరేసుకున్న యువకుడు

ముంబై: కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని తేలినప్పటికీ ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన వైనమిది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆస్పత్రిలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. 20 ఏళ్ల సదరు యువకుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలిపారు. ‘‘కేఈఎం ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం రాత్రి బాధితుడు ఓ వస్త్రంతో కిటీకీ గ్రిల్స్‌కి ఉరేసుకున్నాడు. అతడు ముంబైలోని చెంబూర్ వాసిగా గుర్తించాం. క్యాన్సర్ చికిత్స కోసం జూన్ 20న అతడు ఆస్పత్రిలో చేరాడు. ఈ నెల 2న అతడికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా సోకలేదని నిర్ధారణ అయ్యింది. అయినప్పటికీ బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డాడనే దానిపై విచారణ జరుపుతున్నాం..’’ అని ఓ సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం బోయ్‌వాడ పోలీస్‌ స్టేషన్‌లో ప్రమాదవశాత్తూ మరణంగా కేసు నమోదైందని వెల్లడించారు. 

Updated Date - 2020-07-09T21:50:39+05:30 IST