క్యాండీ

ABN , First Publish Date - 2020-11-28T21:38:19+05:30 IST

ఉసిరికాయలు - అర కేజీ, పంచదార - పావు కేజీ.

క్యాండీ

కావలసినవి: ఉసిరికాయలు - అర కేజీ, పంచదార - పావు కేజీ. 


తయారీ: ముందుగా స్టవ్‌పై ఒక పాత్ర పెట్టి కొద్దిగా నీళ్లు పోసి, పంచదార వేసి పానకం తయారుచేసుకోవాలి. ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉసిరికాయ ముక్కలను పంచదార పానకం వేసి కొద్దిసేపు మరగనివ్వాలి. తరువాత ఉసిరికాయ ముక్కలను పంచదార పానకంలో నుంచి వడకట్టి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ ఉసిరికాయ ముక్కలపై కొద్దిగా పంచదార చల్లుకుని మూడు రోజుల పాటు ఎండలో పెట్టాలి. ఇలా తయారుచేసుకున్న క్యాండీలు మూడు నెలల పాటు నిల్వ ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు.



Updated Date - 2020-11-28T21:38:19+05:30 IST