గంజాయి ఘాటు!

ABN , First Publish Date - 2021-10-18T05:49:57+05:30 IST

జిల్లాలో తరుచూ గంజా యి నిల్వలు పట్టుబడడం ఆందోళన రేపుతుంది. మారుమూల గ్రామాల నుంచి యాథేచ్ఛగా హైదరాబాద్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదే శ్‌ తదితర రాష్ర్టాలకు సరఫరా చేస్తున్నారు. ఇన్నాళ్లు అంతర్‌ పంటగా పత్తిలో సాగు చేసిన గంజాయి ఇప్పుడిప్పుడే కోత దశకు రావడంతో గంజాయి ఘాటు బయట పడుతుంది. గతంలోనూ మారుమూల గ్రామాల్లో పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించడంతో ఆదిలాబాద్‌ మండలం, బజా ర్‌హత్నూర్‌, బోథ్‌, భీంపూర్‌, తలమడుగు మండలా ల్లో గుట్టల కొద్దీ గంజాయి సాగు బయటపడిన సందర్భాలున్నాయి.

గంజాయి ఘాటు!
తలమడుగు మండలంలో గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తున్న అధికారులు(ఫైల్‌)

జిల్లాలో అంతరపంటగా గంజాయి సాగు 

గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌కు తరలింపు

తాజాగా ఆరుగురు యువకుల అరెస్టు 

తప్పించుకుంటున్న అసలు సూత్రధారులు 

కొరవడుతున్న పర్యవేక్షణ

ఆదిలాబాద్‌, అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తరుచూ గంజా యి నిల్వలు పట్టుబడడం ఆందోళన రేపుతుంది. మారుమూల గ్రామాల నుంచి యాథేచ్ఛగా హైదరాబాద్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదే శ్‌ తదితర రాష్ర్టాలకు సరఫరా చేస్తున్నారు. ఇన్నాళ్లు అంతర్‌ పంటగా పత్తిలో సాగు చేసిన గంజాయి ఇప్పుడిప్పుడే కోత దశకు రావడంతో గంజాయి ఘాటు బయట పడుతుంది. గతంలోనూ మారుమూల గ్రామాల్లో పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించడంతో ఆదిలాబాద్‌ మండలం, బజా ర్‌హత్నూర్‌, బోథ్‌, భీంపూర్‌, తలమడుగు మండలా ల్లో గుట్టల కొద్దీ గంజాయి సాగు బయటపడిన సందర్భాలున్నాయి. 

ఉపాధిగా మారుతున్న సాగు..

జిల్లాలో పట్టుబడుతున్న గంజాయి నిల్వలను చూస్తుంటే ఏ స్థాయి లో గంజాయి సాగవుతుందో తెలుస్తోంది. మారు మూల గూడెల్లో అంతర్‌పంటగా సాగుతున్నట్లు తెలు స్తోంది. తలమడుగు, తాంసి, ఆదిలాబాద్‌ మండలం, గాదిగూ డ, బజార్‌హత్నూర్‌ మండలాల్లో  సాగవుతున్నట్లు తెలుస్తుంది. ప్రధానం గా పత్తి, కంది పంట లలో అంతర్‌పంట గా గంజాయిని సాగు చేస్తున్నారు. గంజాయి మొక్కలు కూడా కంది పంటను పోలి ఉండడంతో అనుమానం రాకుండా ఉంటుందన్న ఉ ద్దేశంతో కొందరు సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులు సాగును ఉపాధిగా మార్చుకొని సాగు చేస్తున్నట్లు సమాచారం. ఇలా సా గైన గంజాయిని అక్రమ మార్గాల గుండా తరలించి విక్రయి స్తున్నారు. పెద్దఎత్తున పట్టుబడుతున్న సంఘటనలను మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని ఆస క్తికర అంశాలు వెలుగు చూసే అవకా శం ఉంది.

అనేకచోట్ల.. 

రెండు రోజుల క్రితం భీంపూర్‌ మండలం మందపల్లి శివారులో 220 గంజాయి మొక్కలను అధికారులు ధ్వం సం చేశారు. గంజాయిని తరలిస్తు న్న ఐ దుగురిని జిల్లాకేంద్రంలోని రాంనగర్‌ వద్ద మావల పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా కలెక్టర్‌ చౌక్‌లో వాహనాలను తనిఖీలు చేస్తుండగా గంజాయితో పట్టుబడిన మం చిర్యాల జిల్లా లక్షేటిపేటకు చెందిన యువకుడితో పాటు మరో ఐదుగురు యువకులను అరెస్టు చేసి గం జాయిని స్వాఽధీనం చేసుకున్నారు. బుధవారం తలమడుగు మండలం రత్నాపూర్‌ గ్రామంలో అధికారులు దాడులు చేసి 40గం జాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా తరుచూ గంజాయిని తరలిస్తున్న ముఠా సభ్యులు పట్టుబడడం జిల్లాలో కలకలం రేపుతుంది. ఇన్నాళ్లు గుట్టుచప్పుడుకాకుండా సాగిన దందా వెలుగులోకి రావడంతో పోలీసులు మరింత అప్రమత్తమవుతున్నారు. జిల్లా సరిహద్దు లో ఉన్న చెక్‌పోస్టుల వద్ద సరైన నిఘా లేక పోవడంతో రాత్రికి రాత్రే గంజాయి నిల్వలు పొరుగు రాష్ర్టాలకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు పోలీసులే దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకోవడమే తప్ప సంబంధిత ఎక్సైజ్‌ శాఖ అధికారులు పత్తా లేకుండా పోయారన్న ఆరోపణలున్నాయి.

డబ్బుతో ఎర వేస్తూ..

పంటలను సాగు చేసే సమయంలో స్మగ్లర్లు అమాయక  రైతులకు ఆశచూపుతూ డబ్బుతో ఎర వేస్తూ రహస్యంగా ఒప్పందం చేసుకుంటు న్నారు. మారుమూల గిరిజన గూడెల్లో సంచరి స్తున్న గంజాయి ముఠాలు అమాయక గిరిజ నులనే టార్గెట్‌ చేస్తూ గంజాయిని సాగు చేసే లా ఆశపెడుతున్నారు. సాగుతో పాటు నిల్వల ను సరఫరా చేయడానికి ఒప్పందం చేసుకుం టున్నారు. దొరికితే దొంగ... లేకుంటే దొర అనేచందంగా అసలు సూత్రదారులు చల మాని అవుతున్నారు. కొందరు యువకుల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుంటూ ఉ చ్చులో దింపుతున్నారు. రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో పోలీసులకు పట్టుబడుతూ అమాయక యువకులు కటకటాల పాలవుతున్నారు. కొన్నేళ్లుగా గంజాయి వ్యాపారంలో ఆరి తేరిన ఓ బడా వ్యాపారి తెరచాటున ఉంటూ దందాను సాగిస్తున్నట్లు తె లుస్తోంది. గంజాయిని తరలిస్తూ పట్టుబడిన వారిని రోజుల వ్యవధిలోనే బయటకు తీసు కు వస్తానని ముందే హామీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల పట్టుబడి న వారంతా అమాయక యువకులే కావడం గమనార్హం.

జిల్లా కేంద్రం నుంచే దందా..

జిల్లాకేంద్రానికి చెందిన గంజాయి స్మగ్లర్‌ మోసిన్‌ఖాన్‌ నిర్మల్‌, మం చిర్యాల జిల్లాలకు చెందిన వారికి విక్రయిస్తూ దందా కొనసాగిస్తున్న ట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం పోలీసుల తనిఖీల్లో మంచిర్యాల జిల్లా లక్షేటిపేటకు చెందిన అబ్దుల్‌ సాజిద్‌ అనే వ్యక్తి పట్టుబడడంతో దందా గుట్టురట్టయింది. దీంతో కాడిగే శ్రీకాంత్‌, అంగులశంకర్‌గౌడ్‌, పిట్లంకృష్ణలతో పాటు ఓ బాలున్ని అరెస్టు చేశారు. వీరి నుంచి కిలోకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-10-18T05:49:57+05:30 IST