Abn logo
May 14 2021 @ 11:03AM

కడపలో భారీగా పట్టుబడిన గంజాయి

కడప : కడపలో భారీగా గంజాయి పట్టుబడింది. నగరంలోని చిన్నచౌక్ పీఎస్ పరిధిలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. విశాఖపట్నం నుంచి కడపకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 11 మందిని చిన్నచౌక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 120 కేజీల గంజాయి, ఒక బోలోరో కారు, రూ.7000 నగదు, 5 సెల్‌ఫోన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.


Advertisement
Advertisement
Advertisement