Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారీగా గంజాయి పట్టివేత

తూర్పు గోదావరి: నిషేధిత గంజాయిని తరలిస్తుండగా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్నారనే కచ్చితమైన సమాచారం పోలీసులకు అందింది. దీంతో జిల్లాలోని తూర్పు ఏజన్సీలో గల మారేడుమిల్లి మండలంలోని జీ.ఎం.వలస జంక్షన్‌ దగ్గర వాహన తనిఖీలను పోలీసులు చేపట్టారు. బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ దాదాపు రూ.20 లక్షలు  ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement