గంజాయి రవాణాను మరింత కట్టడి చేయాలి

ABN , First Publish Date - 2021-10-25T06:12:34+05:30 IST

విశాఖ ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు గంజాయి రవాణా జరగ కుం డా సిబ్బంది మరింత అప్రమ త్తంగా ఉండాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ (క్రైమ్‌) లక్ష్మీనారాయణ ఆదేశించారు.

గంజాయి రవాణాను మరింత కట్టడి చేయాలి
చెక్‌పోస్టు వద్ద సిబ్బందికి సూచనలిస్తున్న అడిషనల్‌ ఎస్పీ లక్ష్మీనారాయణ

   జిల్లా అడిషనల్‌ ఎస్పీ లక్ష్మీనారాయణ 

కృష్ణాదేవిపేట, అక్టో బరు 24 : విశాఖ ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు గంజాయి రవాణా జరగ కుం డా సిబ్బంది మరింత అప్రమ త్తంగా ఉండాలని జిల్లా  అడిషనల్‌ ఎస్పీ (క్రైమ్‌) లక్ష్మీనారాయణ ఆదేశించారు. కృష్ణా దేవిపేటకు కిలో మీటరు దూరం భీమవరంలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టును అదివారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా మాట్లా డుతూ సిబ్బంది ఇక్కడ అనునిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు సిబ్బందికి గంజాయి రవాణాలో హస్తం ఉందని తెలిస్తే కఠిన చర్యలు తప్ప వన్నారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉందన్నారు. ఇందుకు ప్రజలంతా తమవంతు సహకారం అందించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో కొయ్యూరు సీఐ అల్లు స్వామినాయుడు, కృష్ణాదేవిపేట ఎస్‌ఐ ఎ.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T06:12:34+05:30 IST