కుడా కలేనా?

ABN , First Publish Date - 2022-02-18T05:58:37+05:30 IST

నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం జిల్లా కేంద్రం అభివృద్ధి లక్ష్యంగా పట్టణ అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

కుడా కలేనా?
కామారెడ్డి జిల్లా కేంద్రం ముఖ చిత్రం ఇదే..

ఫ రాష్ట్రంలో కొత్తగా నగర అభివృద్ధి ప్రాధికార సంస్థలను ప్రకటించిన ప్రభుత్వం

ఫ అందులో కామారెడ్డికి దక్కని చోటు

ఫ ప్రతిపాదనలకే పరిమితమైన కామారెడ్డి పట్టణ అభివృద్ధి సంస్థ

ఫ ఐదేళ్లు గడిచినా కుడాకు మోక్షం కరువు

ఫ పట్టించుకోని ప్రజాప్రతినిధులు

ఫ విలీన గ్రామాలతో విస్తరించిన కామారెడ్డి పట్టణం

ఫ కామారెడ్డి మున్సిపాలిటీపై పెరగనున్న అదనపు భారం

ఫ కుడా ఏర్పడితేనే పట్టణం అభివృద్ధి చెందే అవకాశం


కామారెడ్డి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం జిల్లా కేంద్రం అభివృద్ధి లక్ష్యంగా పట్టణ అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంగా కామారెడ్డి పట్టణ అభివృద్ధి సంస్థ (కామారెడ్డి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా))ను ఏర్పాటు చేసేందుకు ఐదే ళ్ల కిందట జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు రూపొందిం చింది. కానీ కుడా ప్రతిపాదనలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట కొత్తగా మహబూబ్‌నగర్‌, నల్గొండ నగర అభివృద్ధి ప్రాధికార సంస్థలను ప్రకటించింది. కానీ కామారెడ్డి పట్టణ అభివృద్ధి సంస్థను ప్రకటించకపోవడంతో మరోసారి నిరాశే మిగిలింది. ఇటు ప్రజా ప్రతినిధులు, అటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కుడా కాస్త అటకెక్కింది. కామా రెడ్డి పట్టణం ఇప్పటికే సమస్యలతో సతమతమవుతుండగా రెండేళ్ల కిందట మున్సిపాల్టీలోని శివారు గ్రామాలను విలీనం చేయడంతో పట్టణ నిర్వహణపై పురపాలక సంఘానికి తలకు మించిన భారం అవుతోంది. కామారెడ్డి పట్టణం అభివృద్ధి చెందాలంటే కుడాను ఏర్పాటు చేయా ల్సిన అవసరం ఉందని పట్టణ వాసులు కోరుతున్నారు. కొత్తగా రెండు నగర అభివృద్ధి సంస్థలకు అనుమతి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెండు నగర అభివృద్ధి సంస్థలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, నల్గొండలో నగర అభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్‌నగర్‌, నల్గొండలో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు వాటి సమీప ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రారంభించనున్నారు. కానీ ఐదు సంవత్సరాల కింద ప్రతిపాదించిన కామారెడ్డి అభివృద్ధి సంస్థ కుడాకు ప్రభుత్వం ఆమోదం తెలుపలేకపోయింది. కుడాకు అనుమతి ఇస్తే కామారెడ్డి పట్టణ శివారుల్లోని గ్రామాలు మరింత అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉంటుందని ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని కుడా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పట్టణ శివారు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.


ఐదేళ్ల కిందటే ప్రతిపాదనలు

కామారెడ్డి పట్టణం రోజురోజుకూవిస్తరించడంతో చుట్టు పక్కల గ్రామాలను కలుపుకొని కుడా ఏర్పాటు చేయా ల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజా ప్రతినిధులు ఐదే ళ్ల కిందట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయం లో జిల్లా యంత్రాంగం సైతం కుడా ఏర్పాటుపై ప్రతిపాద నలు సిద్ధం చేశారు. ప్రతిపాదనలు సిద్ధమవుతుండగానే 8 కి.మీ పరిధిలోని  గ్రామాలను విలీనం చేస్తూ పట్టణ ప్ర ణాళికలను రూపొందించాలని సూచించారు. దీంతో యం త్రాంగం పురపాలక సంఘం పరిధిలోని 7 గ్రామాలను విలీనం చేస్తూ పట్టణ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలి. ఇదే విధంగా జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి ఆమోదం కోసం రాష్ట్ర మున్సిపల్‌ శాఖ అధికారులకు పంపించారు. కానీ మాస్టరు ప్లాన్‌ సైతం ఆమోదం పొందకపోవడం గమనార్హం. దీంతో పాటు పట్టణ అభివృద్ధి సంస్థ కూడా ఏర్పాటు కాస్త అటకె క్కింది. కుడా ఏర్పాటును సైతం పాలకులు మర్చిపోయా రు దీంతో పట్టణాభివృద్ధి సంస్థ కలగానే మిగిలిపోనుందని పట్టణ ప్రజలు వాపోతున్నారు.


కుడా ఏర్పాటుతోనే అభివృద్ధి

కామారెడ్డి పట్టణం అభివృద్ధి సంస్థ (కుడా) ఏర్పడితే ప్రస్తుత పట్టణ ంతో పాటు విలీన  గ్రామా లు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కొత్తగా మాస్టర్‌ ప్లానింగ్‌ అమలు చేస్తారు. దీంతో పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు వస్తాయి. అలాగే విలీన గ్రామాలను పట్టణా లుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. రహదారులు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజ్‌, తాగునీటి సరఫరా, బ్రిడ్జిల నిర్మా ణం, పార్కుల సుందరీకరణ పనులు చేపట్టడం జరుగు తుంది. కూడా ఏర్పాటుతో ముఖ్యంగా స్థానికంగా లే అవుట్‌ల మంజూరు నిధులు సమకూర్చుకునే వీలుం టుంది. మున్సిపాల్టీ పరిధిలో ప్రస్తుతం రెండు ఎక రాలు ఏర్పాటు చేసే వెంచర్‌లకు మాత్రమే అను మతి ఇస్తోంది. అంతకు మించి లేఅవుట్‌లు చేయాలంటే డీటీసీపీవో అనుమతి అవస రం ఉంటుంది. అది కుడా ఏర్పాటైతే స్థాని కంగా డీటీసీపీ లేఅవుట్‌లు మంజూరు చేసే అవ కాశం ఉంటుంది. అలాగే ఐదు అంతస్తులకు పైగా భవన నిర్మాణాలను నిర్మించుకునే అనుమతి ఇచ్చే వీలు ఉంటు ంది. అలాగే మురికివాడల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధి చేసుకునేందుకు నిధులు పొందేం దుకు వీలుంటుంది.

Updated Date - 2022-02-18T05:58:37+05:30 IST